ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

ABN, Publish Date - Dec 19 , 2023 | 02:36 PM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయడంతో ఈరోజు సీఎం రేవంత్‌ సందర్శించారు.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్డులో గల బంగ్లాకు సీఎం రేవంత్‌‌రెడ్డి వచ్చారు. మంగళ, బుధవారం ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉండనున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను రేవంత్‌రెడ్డి కలవనున్నారు.

ఏఐసీసీ అగ్రనేతలతో కీలక భేటీ

కాగా.. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్‌‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Dec 19 , 2023 | 02:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising