ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: హాట్‌ హాట్‌గా అసెంబ్లీ.. కేటీఆర్‌‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్

ABN, Publish Date - Dec 16 , 2023 | 12:05 PM

Telangana: తెలంగాణ అసెంబ్లీ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) హాట్‌ హాట్‌గా నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ (MLA KTR) చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సెటైర్ విసిరారు.

కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే సరికాదన్నారు. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లదుడామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 16 , 2023 | 12:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising