TS News: శ్రీనిధి కాలేజ్‌లో తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తం
ABN , First Publish Date - 2023-08-23T12:00:03+05:30 IST
హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ శ్రీనిధి యూనివర్శిటీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

హైదరాబాద్: హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ శ్రీనిధి యూనివర్శిటీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వర్సిటీ వద్దకు భారీగా పోలీసులు తరలివచ్చారు. మోసపూరితంగా యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు తీసుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వర్సిటీ నుంచి శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలోకి విద్యార్థులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. అయితే తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నప్పటికీ వర్సిటీ వద్ద యాజమాన్యం కనిపించని పరిస్థితి. మరోవైపు వర్సిటీ లోపలికి మీడియాను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశఆరు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరు వెంకట్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.