Dharmapuri Arvind : మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సోనియా ఫోన్ కూడా చేయలేదు
ABN, First Publish Date - 2023-03-28T10:57:39+05:30
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.
Hyderabad : పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీనివస్ తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న మొదటి నుంచి కాంగ్రెస్ వాది. ఆయనకు ఆరోగ్యం బాగోలేనపుడు సోనియా గాంధీ కనీసం ఫోన్ చేయలేదు. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటే కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా ఇంటికి వచ్చి పార్టీలో ఆయనను జాయిన్ చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివా్‌స(డీఎస్) తిరిగి కాంగ్రె్‌సలో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపింది. డీఎస్ కుమారులిద్దరి మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కేలా చేసింది. ఈ నెల 26న డి.శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ, ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స కూడా పొందిన డీఎస్.. వీల్‌చైర్‌లోనే గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డీఎస్ కుమారుడు సంజయ్‌తోపాటు ఆయన మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై సోమవారం ఆయన కుటుంబంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాంగ్రె్‌సలో చేరి ఒక్కరోజు కూడా గడవక ముందే.. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు డీఎస్ లేఖను విడుదల చేశారు. దీనిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. తన వయసు, అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాల్లో ఉండలేనని పేర్కొన్నారు. తన కుమారుడు సంజయ్‌ని ఆశీర్వదించేందుకు గాంధీభవన్‌కు వెళితే తనకు కూడా కండువా కప్పి పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని తెలిపారు. డీఎస్ సతీమణి విజయలక్ష్మి కూడా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై డీఎస్ పెద్ద కుమారుడు డి.సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా తన తమ్ముడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వల్లే జరుగుతోందని ఆరోపించారు. లేఖలు కల్పితమని, తన తండ్రిని బంధించి సంతకం చేయించారని అన్నారు. కాంగ్రెస్ వర్గాలు కూడా అర్వింద్ ఒత్తిడి మేరకే ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆరోపించాయి. అయితే బాత్రూంకు కూడా వెళ్లలేని తన తండ్రిని గాంధీభవన్‌కు తీసుకెళ్లి కండువా కప్పారని అర్వింద్ ఆరోపించారు.
Updated Date - 2023-03-28T10:57:39+05:30 IST