ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Earthquake: హైదరాబాద్‎కు భూకంపం వచ్చే ఛాన్స్ ఎందుకు లేదంటే..

ABN, First Publish Date - 2023-02-28T08:38:39+05:30

భూకంపం..! క్షణాల్లో విధ్వంసాన్ని సృష్టించగల అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటి..! భూప్రకంపనలకు శాస్త్రీయంగా మూడు ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భూకంపం (Earthquake)..! క్షణాల్లో విధ్వంసాన్ని సృష్టించగల అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటి..! భూప్రకంపనలకు శాస్త్రీయంగా మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది భూ పటలాలు(ప్లేట్స్) కదలికలు.. ఒక దానికి మరొకటి ఢీకొనడం. రెండోది అగ్నిపర్వాతాలు(సముద్రగర్భ అగ్నిపర్వాతాలు, భూ ఉపరితల అగ్నిపర్వతాలు) విస్పోటం చెందడం. చివరిది మానవ తప్పిదాలతో జరిగేది. కారణం ఏదైనా.. తీవ్రమైన ఆస్తి, ప్రాణనష్టం కలిగించే భూకంపాలపై ఇటీవల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తుర్కియేలో భూప్రకోపాన్ని మరిచిపోక ముందే.. దేశంలోని పలు ప్రాంతాల్లో.. పొరుగుదేశాల్లో భూకంపాల రావడం.. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ ఉదంతంతో.. భూకంప ప్రభావిత జోన్లలో ఉంటున్నవారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే.. సెస్మిక్‌జోన్ల వారీగా చూసుకుంటే.. తుర్కియేలాంటి దేశాలు ఎక్కువ ముప్పు ఉన్న ప్రదేశాలు కాగా.. మన దేశంలో ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదికి ముప్పు తక్కువ. ఇంకా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాలు దాదాపుగా సేఫ్ జోన్‌లో ఉన్నాయి.

హైదరాబాద్ ప్రత్యేకత అదే..!

ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. ప్రత్యేక తెలంగాణలోనైనా పరిశ్రమలు హైదరాబాద్‌కు (Hyderabad) రావడానికి ఇక్కడ అనుకూల వాతావరణాలే కారణం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం.. ఇక్కడ పెద్దగా ప్రతికూల పరిస్థితులు ఉండవు. భూకంపాల విషయంలోనూ హైదరాబాద్ సేఫ్‌జోన్ (Hyderabad Safe Zone) అని నిపుణులు చెబుతున్నారు. అటు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ (Vizag), కృష్ణా-గోదావరి డెల్టా కూడా సేఫే అంటున్నారు. దేశంలో ఐదు భూకంప జోన్లు ఉండగా.. అసోంలోని గువాహటి, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌, హిమాలయ సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలు, గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్ కచ్, ఉత్తర బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్-నికోబార్ దీవులు జోన్-5లో ఉన్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, రాజస్థాన్ రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ ఉత్తర భాగం, బిహార్ దక్షిణ భాగం, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగం జోన్-4లో ఉన్నాయి. ఐదో జోన్‌తో పోలిస్తే.. జోన్-4కు భూకంపాల ముప్పు కొంత తక్కువగా ఉంటుంది. భూకంప తీవ్రత, ప్రకంపనల తీవ్రత కొంత తగ్గుతుంది. ఇక తీవ్రత చాలా తక్కువగా ఉండేవి జోన్-3, జోన్-2 ప్రాంతాలు. దక్షిణ భారతదేశమంతా జోన్-3, 2ల్లో ఉంది. దీంతోపాటు.. గోవా, మహారాష్ట్ర, ఒడిసా, లక్షద్వీప్ జోన్-2, జోన్-3ల పరిధుల్లో ఉన్నాయి. అంటే.. భూకంపాల విషయంలో ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణ భారతదేశం చాలా వరకు సేఫ్ అని భూగర్భ నిపుణులు చెబుతున్నారు.

ఉత్తరాదిలో ఎక్కువ భూకంపాలెందుకు?

భూగర్భంలోని పలకలు ఢీకొనడం వల్ల భూకంపాలు ఏర్పడుతాయి. భారత ఉపఖండం ఇండియన్ ప్లేట్‌పై ఉంది. దీన్నే ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ ఉత్తరం వైపునకు ఏడాదికి 49 మిల్లీమీటర్ల చొప్పున కదులుతుంది. అలా కదిలినప్పుడు ఎగువన ఉన్న యూరోషియన్ ప్లేట్‌ను ఢీకొంటుంది. ఈ రెండు పలకాలు ఢీకొనడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. భూకంప కేంద్రం దాదాపు హిమాలయాలకు సమీపంలో ఉంటుంది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపిస్తుంది. భూకంప కేంద్రం భూగర్భంలో ఎంత లోతులో ఉంటే.. తీవ్రత అంత తక్కువగా ఉంటుంది. అయితే.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో కనిష్ఠంగా ప్రతి 25 ఏళ్లకు ఒక్కసారైనా.. భూమి కంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. దక్షిణాదిలో ఆ ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండడం, ఇక్కడి నేల స్వభావం, గృహ నిర్మాణాల్లో పటిష్ఠత వంటి కారణాలతో దాని ప్రభావం తక్కువ అని వివరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభావిత ప్రాంతాలివే..

జోన్-5, 4లతో పోలిస్టే.. జోన్-3 చాలా వరకు సేఫ్. జోన్-2లో భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలోని (Telangana) హైదరాబాద్, ఏపీలోని (Andhra Pradesh) విశాఖ నగరాలు జోన్-2లో ఉన్నాయి. తెలంగాణలోని మూడొంతుల భూభాగం జోన్-2లో.. మిగతా భాగం జోన్-3లో ఉంది. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ జోన్-2లోనే ఉన్నాయి. అయితే.. జోన్-3లో ఉన్న తెలుగు రాష్ట్రాల భూభాగాల్లో భూకంపాలకు కొంత వరకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాబితాలో భద్రాచలం (Bhadrachalam), ఖమ్మం(Khammam), వరంగల్ (Warangal), రాజమండ్రి (Rajahmundry), కాకినాడ (Kakinada), విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur), నెల్లూరు (Nellore) నగరాలు/పట్టణాలు ఉన్నాయి. ఈ క్రింది ప్రాంతాల్లో కొంత భూకంప తీవ్రత ఎక్కువ(రిక్టర్ స్కేల్‌పై 6 దాకా తీవ్రత) ఉండే అవకాశాలున్నాయి.

భద్రాచలం ప్రాంతంలోని గోదావరి లోయ

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని పినపాక, గుండాల, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు మండలాలు

ఒంగోలు ప్రాంతంలోని గుండ్లకమ్మ ప్రాంతం

విజయనగరంలోని గరివిడి, నెల్లిమర్ల మండలాలు (ఈ ప్రాంతాలు జోన్-2లో ఉన్నా.. సెస్మికల్లీ యాక్టివ్ జోన్ అంటారు)

హైదరాబాద్ నగరం సేఫ్ జోన్‌లో ఉన్నా.. కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంత సేఫ్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ జాబితాలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్‌పేట్, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మొయినాబాద్, వికారాబాద్ జిల్లాలోని శంకర్‌పల్లి కూడా సెస్మికల్లీ యాక్టివ్ జోన్‌లో ఉన్నాయి.

గత అనుభవాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సహా.. పలు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చిన చరిత్ర ఉన్నా.. ఆస్తి, ప్రాణనష్టం తీవ్రత తక్కువ. 1969లో భద్రాచలం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావం కిన్నెరసాని రిజర్వాయర్‌పై కనిపించింది. విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో 1917లో 5.5 తీవ్రతో భూకంపం సంభవించింది.

భూకంప హెచ్చరికలు వస్తే ఏంచేయాలి?

ఒకప్పుడు భూకంపాలను అంచనా వేయడం సాధ్యమయ్యేది కాదు. కానీ, ఆధునిక సాంకేతికతతో ఇప్పుడు భూకంపాలు, సునామీలను ముందుగానే పసిగడుతున్నాం. అలా.. ఒక ప్రాంతానికి భూకంప హెచ్చరిక వస్తే.. ఆ ప్రాంతంలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తరచూ భూకంపాలు వచ్చే జోన్లలో భూకంప భద్రత కిట్‌లను కొని, పెట్టుకోవాలి

ప్రథమ చికిత్స సామగ్రిని సిద్ధం చేసుకోవాలి

ఒక సేఫ్ షెల్టర్‌ను గుర్తించి, అక్కడ కావాల్సిన నీరు, ఆహార పదార్థాలు, డస్ట్ మాస్కులు, టార్చ్, రేడియో, ప్రథమ చికిత్స సామగ్రిని భద్రపరచాలి

సాధ్యమైనంత వరకు ఇళ్లలో.. ముఖ్యంగా బహుళ అంతస్తుల్లో ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇతరులను కూడా అప్రమత్తం చేయాలి. ఒకే అంతస్తు ఇళ్లు అయితే.. తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది.

ఆకాశ హార్మ్యాలకు దూరంగా ఉండాలి

భూమి కంపిస్తే.. వెంటనే.. మంచం, టేబుల్‌లాంటి వస్తువుల కిందకు వెళ్లాలి. దాని వల్ల ఇంటి పైకప్పు కూలినా.. ఆ శకలాలు పైనపడకుండా మంచం, టేబుల్ కొంత వరకు కాపాడుతాయి.

బరువైన వస్తువులు, తలుపులు, కిటికీలకు దూరంగా ఉండాలి

వాహనాలు నడపడం వంటివి చేయకూడదు

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల్లో వెళ్లినా.. భూకంప బాధితులకు సహాయం అందించేందుకు వచ్చే అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలి

భూకంపం వచ్చాక.. కొన్ని సార్లు స్వల్ప ప్రకంపణలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. అండర్‌పాస్‌లు, భవనాలు, ఓవర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, రోడ్‌ఓవర్లపై ప్రయాణాలు మంచిది కాదు. ఆ సమీపంలో వాహనాలను ఆపడం కూడా ప్రమాదమే.

భూకంపం వచ్చిన తర్వాత..

రేడియోలో భూకంప తీవ్రత వార్తలను తెలుసుకోండి

వెంటనే ఇంట్లోకి వెళ్లి, వస్తువులను తనిఖీ చేసుకోకూడదు. మళ్లీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉంటుంది. తుర్కియేలో మరణాల సంఖ్య పెరగడానికి ఇలాంటి చర్యలు కూడా కారణమని అక్కడి అధికారులు చెప్పారు.

అధికారులు చెప్పే సూచనలను పాటించాలి

భూకంపాల వల్ల మురుగునీటి వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా టాయ్‌లెట్లను వినియోగించకూడదు

మీకు ఒకవేళ రెస్క్యూ సహాయం కావాలంటే.. తలుపు, లేదా కిటికీపై ‘హెల్ప్’ అని రాసి ఉంచాలి.

మీ ఇల్లు భూకంపాన్ని తట్టకుంటుందా?

ఒకప్పుడు ఇంటినిర్మాణాలను సాధారణంగా చేసేవారు. కానీ, రెరా చట్టం వచ్చాక బిల్డర్లు కూడా పక్కాగా శాస్త్రీయ పద్ధతులను పాటిస్తున్నారు. ఒకవేళ స్ట్రక్చరల్ ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా జరిపే చిన్న చిన్న ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలోని భూకంపాలు/సూనామీ పరిశోధనల కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్‌కుమార్ పిల్లర్ల నిర్మాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆయన ప్రయోగం చాలావరకు సత్ఫలితాలనిస్తోంది. ఒక ఇల్లు భూకంపాన్ని తట్టకుంటుందా? అనే అంశంపై శాస్త్రవేత్తలు స్వీయ పరీక్షలు చేసుకునేలా కొన్ని విధానాలను చెప్పారు.

అవి..

స్లాబ్‌లో ఏమైనా పగుళ్లు వస్తున్నాయా? అనే విషయాన్ని గమనించాలి

పిల్లర్లకు, భీమ్‌లకు ఆనుకుని, నిర్మించిన గోడల వద్ద పగుళ్లు వస్తున్నాయా? అనే విషయాన్ని గుర్తించాలి

ఇంట్లో ఫర్నిచర్‌ను కదిల్చేప్పుడు.. లేదా నడుస్తున్నప్పుడు ఎక్కడైనా అధిక ప్రకంపనాలు వస్తున్నాయా? అనే విషయాన్ని గమనించాలి

చాలా మంది ఇంటి నిర్మాణాన్ని పకడ్బందీగా చేసినా.. డూప్లెక్స్ ఇళ్లలో మెట్ల పైగది(స్టేర్‌కేస్ రూం) విషయంలో నాసిరకం మెటీరియల్‌ను వాడుతారు. ఇలాంటి చర్యలు భూకంపాల సమయంలో ప్రమాదకరం. ‘పాన్ కేక్’ కొలాప్స్‌కు ఈ చర్యలు కారణం కావొచ్చు.

కొత్తగా ఇళ్లు నిర్మించిన వారు.. స్ట్రక్చరల్ ఇంజనీర్లను సంప్రదించి, భూకంపాలను తట్టుకోగలదా? అనే పరీక్షలు చేయించడం మంచిది. ఇందుకు అయ్యే ఖర్చు రూ.2 వేల నుంచి రూ. 3వేల మధ్య ఉంటుంది. స్ట్రక్చరల్ ఇంజనీర్లు సదరు ఇంటి పటిష్ఠత భారతీయ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఉందా? లేదా? అనే విషయాలను పరీక్షిస్తారు.

ఒకవేళ ఐదారేళ్ల క్రితమే ఇంటినిర్మాణం జరిగి ఉంటే.. భవనం డిజైన్‌ను స్ట్రక్చరల్ ఇంజనీర్‌కు అందజేస్తే.. సెస్మిక్ డిజైన్ కంప్లయన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భవనం లోడ్ బేరింగ్(స్క్వేర్ మీటర్‌కు ఎన్ని టన్నుల బరువును భరిస్తుంది? అనేదాన్ని పరిశీలించడం), నిర్మాణ స్థిరత్వం వంటి పరీక్షలను చేపట్టి, సర్టిఫికెట్ ఇస్తారు.

Updated Date - 2023-02-28T09:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!