Harish Rao: నిర్మలాసీతారామన్‌పై ఘాటు వ్యాఖ్యలు.. ఆమె మాటల్లో..
ABN, First Publish Date - 2023-02-17T18:09:05+05:30
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో నిజాయితీ లేదని హరీష్రావు విమర్శించారు.
సిద్దిపేట: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీష్రావు (Telangana Minister Harish Rao) కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో నిజాయితీ లేదని హరీష్రావు విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గోరంత.. చెప్పేది కొండంత అని హరీష్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతి అన్నట్లుంది కేంద్రం తీరు, వైద్య కళాశాలల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నామని హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కారని మంత్రి హరీష్రావు ఆరోపించారు.
అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM Chandrasekhar Rao)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ట్రిలియన్‌పై జోకులు వేయవద్దంటూ రెండు చేతులు జోడించి సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. తెలంగాణకు 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. తమపై విమర్శలు చేస్తున్నారని, మరి మీ సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలున్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకే ప్రతిపాదనలు పెట్టారని నిర్మల ఎద్దేవా చేశారు. నెంబర్స్ చూసి విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. నో డేటా గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు అర్థమవుతుందని నిర్మల వ్యాఖ్యానించారు.
కాగా 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా శాసనసభలో సీఎం కేసీఆర్ (KCR) అభివర్ణించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ అని, మోదీ బడాయిలు పోతున్నారని, వైఫల్యాలను హుందాగా ఒప్పుకోవాలని సీఎం అన్నారు. ఎకనామీగా ఉండటం వేరని, అసలు సంగతి తలసరి ఆదాయం దగ్గర దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ ముందున్నాయని చూపుతూ విమర్శించారు. దీనిపై చర్చ జరగాలన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని ఇండియాలో బ్యాన్ చేయాలనడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ప్రపంచమంతా మనగురించి ఏమనుకుంటుందో కొంచెం ఆలోచించాలన్నారు. వ్యతిరేకిస్తే జైలులో పెడతాం, బ్యాన్ చేస్తామంటారా? ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని సీఎం జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూాడా చదవండి
*************************************************
నామినేటెడ్ మెంబర్లకు ఓటింగ్‌పై సుప్రీం సంచలన నిర్ణయం
*****************************
**************************************
Updated Date - 2023-02-17T18:16:34+05:30 IST