Indrasena Reddy: రేవంత్ కవితకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలి
ABN, First Publish Date - 2023-09-10T17:14:51+05:30
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA)కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి( Indrasena Reddy) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA)కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి( Indrasena Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ కేసీఆర్(KCR) కంటే పెద్ద దగా కోరు పార్టీ కాంగ్రెస్. గ్రౌండ్ కోసం కాంగ్రెస్(Congress) అప్లికేషన్ పెట్టలేదు. పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలి.ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది ? మీకు బీఆర్ఎస్‌తో బిజినెస్ సంబంధాలు లేవా? కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొని వారితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటిగా కలవనున్నాయి. కలుస్తారని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ. దరఖాస్తు తేదీ పొడిగింపుపై ఎటువంటి చర్చ జరగలేదు. కిసాన్ సర్కార్ అంటూ దేశవ్యాప్తంగా కేసిఆర్ తిరుగుతున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది సరిపోక దేశవ్యాప్తంగా మోసానికి బయల్దేరాడు. కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీని కేసీఆర్ అందకుండా చేస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టి రైతులు సొమ్మసిల్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటున్నారు. ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బస్తా మీద ముద్రిస్తున్నారు. ఈ విషయం రైతులకు తెలియకూడదని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గతంలో ఎరువుల కొరత ఉండేది.. కానీ నేడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. మూత పడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధాని మోదీ రీ ఓపెన్ చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారు. చేతగాని తనం తోనే కేంద్రం ఇచ్చే ఎరువులను కేసీఆర్ రైతులకు ఇవ్వలేకపొతున్నాడు. కేసీఆర్‌కి రాజకీయం తప్ప ఇంకేమి చేతకాదు. మార్క్ ఫెడ్‌లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలి. లేదంటే రైతులకు నేరుగా మేమే వాటిని అందజేస్తాం. రాజకీయంగా పార్టీల తరపున కొట్లడదాం... రైతులతో చెలగాటం వద్దు’’ అని నల్లు ఇంద్రసేనారెడ్డి హితవు పలికారు.
Updated Date - 2023-09-10T17:14:51+05:30 IST