ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka: విభజన చట్టం హామీలపై ప్రధాని మోదీని కలిశాం

ABN, Publish Date - Dec 26 , 2023 | 06:43 PM

విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రిని నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని మోదీతో అరగంటపాటు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ఢిల్లీ : విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రిని నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని మోదీతో అరగంటపాటు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు.

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ITIR ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు IIM, సైనిక్ స్కూల్‌ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు. BRS నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు.. ఆర్థిక సాయం చేయాలని ప్రధానిమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. 2015-19, 2020-21కి సంబంధించి రూ. 450 కోట్లు రావాల్సిన కొన్ని నిధులు గురించి అడిగామన్నారు. నీటి పారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరినట్లు చెప్పారు.

ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని.. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. నిబంధనల సడలింపు గురించి, ఇతర మినహాయింపుల గురించి అడగలేదన్నారు. విభజన హామీలతో పాటు అదనంగా కొన్ని అంశాలను అడిగినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించామని చెప్పారు. శ్వేత పత్రం గురించి కూడా ఆయనకు తెలియజేశామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం నుంచి అందించే సహాయం అందించాలని కోరామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 07:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising