ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu Ravi: పొన్నాలకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్..

ABN, First Publish Date - 2023-10-14T18:08:41+05:30

మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘పొన్నాల మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. మొన్నటి దాకా తిట్టిన బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాల వెళ్లడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేరు. సోషల్ మీడియాలో చూస్తే బీఆర్ఎస్ పార్టీపై పొన్నాల ఏం మాట్లాడారో తెలుస్తుంది. పొన్నాల కాంగ్రెస్ వైపే ఉండాలని కోరుకుంటున్న. ప్రవళిక ఇంటికి వెళ్లి ఓదార్చే సమయం మంత్రి కేటీఆర్‌కి లేదు.. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లడానికి మాత్రం కేటీఆర్‌కి టైం ఉంటుంది. బీసీలపై కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. బీసీ ఈటలపై కుట్ర చేసి, హింస పెట్టి పార్టీ నుంచి బయటకి పంపారు. టికెట్ విషయం ఇంకా ఫైనలైజ్ కాకముందే టికెట్ ఇవ్వలేదని పొన్నాల ఎలా అంటారు. విజయశాంతి బీసీ నేతనే కదా. ఆమెని ఎందుకు బయటకి పంపారు. ఆలే నరేంద్ర బీసీనే... ఆయన్ని ఎలా బయటకి పంపారు.డి.శ్రీనివాస్ మా పార్టీ నేత... ఆయన్ని కేసీఆర్ పిలిచి చివరికి ఎంత అవమాన పరిచారు. కాంగ్రెస్ నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు బీసీలే. బీసీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్‌లకు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్’’ అని మల్లు రవి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-14T18:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising