ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasingh రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ...

ABN, First Publish Date - 2023-01-31T10:31:49+05:30

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, పలుమార్లు నోటీసులు అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, పలుమార్లు నోటీసులు అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ (Goshamahal MLA Rajasingh) కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ర్యాలీలో విద్వేష ప్రసంగం చేశారంటూ ఎమ్మెల్యేకు మంగళ్‌హాట్‌ పోలీసులు (Mangalhat Police) నోటీసులు ఇచ్చారు.

ఇటీవల లవ్ జిహాద్‌ (Love Jihad)కు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (State, Central Governments) చట్టాలు తీసుకురావాలన్న డిమాండ్‌తో ముంబై (Mumbai)లో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు రాజాసింగ్ (Rajasingh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో రాజసింగ్‌కు మహారాష్ట్ర (Maharashtra) ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. హిందూ మద్దతుదారులతో ముంబైలో శివాజీ పార్క్ (Shivaji Park in Mumbai) ప్రాంతం కిక్కిరిసిపోయింది. గతంలో పుణె (Pune)లో నిర్వహించిన ర్యాలీలో కూడా రాజాసింగ్‌కు విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర సభలో రాజాసింగ్ మతపరంగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నోటీసు సారాంశం....

ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన జనాక్ క్రోస్ మోర్చా ర్యాలీ (Janak Kroes Morcha Rally)లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారంటూ రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ (PD Act on Rajasingh) ఎత్తివేసే సందర్భంగా హైకోర్టు (Telangana HighCourt) విధించిన షరతులను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెండు రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని... లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళహాట్ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు లవ్‌టెటర్స్ పంపుతున్నారు...రాజాసింగ్ సెటైర్

తెలంగాణ (Telangana State) నుంచి బహిష్కరించినా, జైలుకు పంపినా ధర్మం కోసం పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) స్పష్టం చేశారు. తెలంగాణలో 8వ నిజాం పాలన సాగుతోందన్నారు. లవ్ జిహాద్, గో హత్యపై మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వనికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చట్టం తేవాలి అని డిమాండ్ చేస్తున్న అది కూడా మహారాష్ట్రలో మాట్లాడిన. మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్‌హాట్ పోలీసులు నాకు లవ్ లెటర్స్ పంపిస్తున్నారు. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. నిన్న నాకు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీపై పీడియాక్ట్ పెట్టగా హైకోర్టు ఉత్తర్వులతో మీరు బయట ఉన్నారని వాటిని ఉల్లంఘిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఇక చాలు నాకు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అంటూ రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రెండు సార్లు నోటీసులు.. పలు కేసులు నమోదు..

గతంలో కూడా రాజాసింగ్‌కు రెండు సార్లు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆగష్టులో అజ్మీర్ దర్గా (Ajmer Dargah)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 41ఏ సీఆర్పీసీ (41A CRPC) కింద నోటీసులు జారీ చేశారు. అయితే కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ (Kanchanbagh Police Station)లో నమోదైన కేసు మంగళ్‌‌హాట్ పోలీస్‌స్టేషన్‌ (Mangalhat Police Station)కు బదిలీ అవడంతో మంగళ్‌‌హాట్ పోలీసులు నోటీసులు పంపారు. అలాగే ఫేస్‌బుక్‌ (Facebook post)లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు రాజాసింగ్ కామెంట్ పెట్టగా.. అది ఓ మతాన్ని కించపరిచే విధంగా ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకుముందు కూడా రాజాసింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. మహ్మద్‌ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ (Standup comedian Munawar Farooqui) ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police), తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అనుమతి ఇవ్వగా రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో హిందూ దేవతలను అవమానపరుస్తూ మాట్లాడిన మునావర్ ఫరూఖీ షోకు ఎలా అనుమతి ఇస్తారని ప్రభుత్వాన్ని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాతబస్తీ (Old City)తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అయితే రాజాసింగ్‌‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ భార్య ఉషాభాయి (Rajasingh Wife Usha Bhai) హైకోర్టును ఆశ్రయించడంతో పాటు గవర్నర్‌ తమిళిసై (Telangana Governor Tamilisai)ను కలిశారు. హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని అక్రమంగా అనేక కేసులు నమోదు చేశారని, చివరికి పీడీ యాక్ట్ కింద బుక్ చేసి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. తన భర్త విడుదల కోరుతో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. అటు హైకోర్టులోనూ ఉషాభాయి పిటిషన్ దాఖలు చేయగా... పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ర్యాలీలో పాల్గొనవద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-31T10:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising