Tarakaratna: నందమూరి తారకరత్నమృతి పట్ల సీఎం కేసీఆర్‌తో సహా పలువురి ప్రముఖుల సంతాపం
ABN , First Publish Date - 2023-02-19T00:23:28+05:30 IST
సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరు(Bangalore)లోని నారాయణా హృదయాలయ(Narayana Hrudayalaya) ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరు(Bangalore)లోని నారాయణా హృదయాలయ(Narayana Hrudayalaya) ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్(CM KCR), పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు((CM KCR)) సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన లేని లోటు కుటుంబానికి, సినీ పరిశ్రమకు పూడ్చలేనిదని చెప్పారు. తారకరత్న మృతికి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన, అర్వింద్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు.
విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు: కిషన్‌రెడ్డి
నందమూరి తారకరత్న మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (KishanReddy) సంతాపం వ్యక్తం చేశారు.విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న తారకరత్న చిన్నవయసులో మృతిచెందడం దురదృష్టకరమన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతిని తెలిపారు.
తారకరత్న మృతిబాధాకరం: రామ్మోహనరావు
తారకరత్న మృతికి టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు (Kambhampati RammohanaRao) సంతాపం తెలిపారు. తారకరత్న మృతిబాధాకరం.. ఎన్టీఆర్ మనవడైనా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు, అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అభిమానుల ప్రార్ధనలు ఫలించి పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారని ఆశించాం. తారకరత్న ఇక లేరనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన ఆత్మశాంతికి భగవంతుని ప్రార్ధిస్తున్నాను. నందమూరి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలి: బండి సంజయ్
సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా.కుటుంబ సభ్యులకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్(Hyderabad) తీసుకువచ్చి మోకిల(Mokhila)లోని తన ఇంటికి తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్(Film chamber)కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.