Share News

Komatireddy: ఢిల్లీలో తెలంగాణ భవన్‌పై మంత్రి కోమటిరెడ్డి రివ్వూ

ABN , First Publish Date - 2023-12-12T13:53:50+05:30 IST

హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం రివ్యూ నిర్వహించారు. 19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వాటితోపాటు గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్పిటల్, పటౌడీ గ్రాండ్‌ను పరిశీలించారు.

Komatireddy: ఢిల్లీలో తెలంగాణ భవన్‌పై మంత్రి కోమటిరెడ్డి రివ్వూ

హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మంగళవారం రివ్యూ (Review) నిర్వహించారు. 19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వాటితోపాటు గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్పిటల్, పటౌడీ గ్రాండ్‌ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి వివరిస్తానని వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోపు భవన నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉమ్మడి భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదన్నారు. డిజైన్లు ఖరారు చేసి, టెండర్లు పిలిచి ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-12T13:53:51+05:30 IST