Minister Srinivasa Reddy: ధరణిపై స్పష్టమైన ఆధారాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాం
ABN, Publish Date - Dec 24 , 2023 | 05:06 PM
ధరణి ( Dharani ) పై స్పష్టమైన ఆధారాలతో త్వరలోనే మీ ముందుకు వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. ఆదివారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేవం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పలు వివరాలను మీడియాకు మంత్రి పొంగులేటి తెలిపారు.
హైదరాబాద్: ధరణి ( Dharani ) పై స్పష్టమైన ఆధారాలతో త్వరలోనే మీ ముందుకు వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. ఆదివారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేవం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పలు వివరాలను మీడియాకు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...‘‘పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజా పాలనను తీసుకొచ్చారు. ప్రజా పాలన పేరుతో డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీవరకు కార్యక్రమం జరుగుతుంది. టీమ్స్‌గా ఏర్పడి రెండు సెషన్స్‌గా సభలను నిర్వహిస్తాం. ఆరు గ్యారెంటీలకు సంబంధించి గ్రామ సభకు డిసెంబర్ 28వ తేదీలోపే విధివిధానాలు చేరుతాయి. 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజలు చేసుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు జరుగుతాయి. తక్కువ సమయం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో వెబ్‌సైట్ పెట్టీ ఇన్ టైంలో అప్లై చేసుకున్న వారికే అవకాశం అన్నట్లు మేము అనము. గతంలో కలెక్టర్ల సమావేశం అంటే వన్‌సైడ్‌గా ఉండేది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
గతంలో అధికారుల అభిప్రాయాలు తీసుకునే వారు కాదు
‘‘గతంలో అధికారుల సూచనలు, అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. గ్రామ పంచాయతీలకు కొన్ని గ్రామాలు దూరంగా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు అధికారులే వెళ్లాలి. డ్రగ్స్ అరికట్టడంలో ఐపీఎస్ (IPS ) లకు స్పష్టమైన ఆదేశాలు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారు. సమావేశంలో ధరణిపై ఒక అవగాహన ఉంది. ధరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పేరు మీద గత ప్రభుత్వంలో పెద్దలు తమ పేరు మీద భూమిని రిజిష్టర్ చేసుకున్నారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన అవగాహన ఉంది. చాలా ఏళ్ల తర్వాత అధికారులు ఓపెన్ అయి మాట్లాడారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు... కానీ తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు అన్నది అధికారులకు స్పష్టం చేశాం. ధరణిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. భవిషత్‌లో ఒక రోజంతా సమీక్ష చేయాల్సి ఉంది. ధనిక రాష్ట్రాన్ని 6లక్షల అప్పులు, విద్యుత్‌లో 81వేల కోట్ల అప్పులు ఉన్నట్లు BRS నాయకులే ఒప్పుకున్నారు. మంచిగా ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చి పెద్ద భవనం కట్టెంత అవసరం ఏంటి? ఇదేనా అభివృద్ధి’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
Updated Date - Dec 24 , 2023 | 05:06 PM