Minister Sabita: ‘కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదు’
ABN, First Publish Date - 2023-03-11T14:54:59+05:30
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita)పై బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita IndraReddy)అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ (BJP Leader) సంస్కారం మరిచి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ మహిళలతో పాటు, దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలు సరికాదు గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. మోదీ (PM Modi) దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ (BJP)లో మహిళలకు ఎక్కడ గౌరవం ఉందని ప్రశ్నించారు. మోదీకి గిట్టదు అనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పుతున్నారని మంత్రి మండిపడ్డారు.
సబిత ఇంకా మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ కోసం కవిత ధర్నాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడడం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ధర్నా చేసే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు 50 శాతం మేర ఉన్నారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నా చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. రిజర్వేషన్ లేకపోయినా మహిళను మేయర్‌ను చేసిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో లేవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-03-11T14:54:59+05:30 IST