NVSS.Prabhakar: కేటీఆర్‌కు ఆ 42 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి?
ABN, First Publish Date - 2023-03-14T14:48:35+05:30
మంత్రి కేటీఆర్ (KTR) టార్గెట్‌గా బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS.Prabhakar) తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (KTR) టార్గెట్‌గా బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS.Prabhakar) తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. 2009లో కేటీఆర్ ఆస్తులు 4 కోట్లు ఉండగా.. అదే 2014 ఎన్నికలు వచ్చేసరికి 8 కోట్లు అయ్యాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి 42 కోట్లు పెరిగాయన్నారు. 4 కోట్ల నుంచి 42 కోట్ల వరకు కేటీఆర్ ఆస్తులు ఎట్లా పెరిగాయి.? అని నిలదీశారు. దీనిపై తెలంగాణ (Telangana) ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో కేటీఆర్‌కు వాటా ఇవ్వాల్సిందేనట.. ఇలా అధికార దుర్వినియోగంతో కేటీఆర్ ఆస్తులు సంపాదించారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కవితను టార్గెట్ చేసుకుని ఈడీ, సీబీఐ దాడులు చేయిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా కేటీఆర్‌ను లక్ష్యం చేసుకుని బీజేపీ విమర్శలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..
Updated Date - 2023-03-14T14:48:35+05:30 IST