Congress: రేపు తెలంగాణలో రాహుల్, ప్రియాంకగాంధీ పర్యటన
ABN, First Publish Date - 2023-10-17T15:36:34+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Rahul Gandhi ) రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు.
ములుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి హస్తం పార్టీ దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Rahul Gandhi ) రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకొనుని రామప్ప దేవాలయాన్ని దర్శించు కుంటారు. రామప్ప రుద్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను శివుడి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్
రామప్ప ఆలయం నుంచి రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజులు, ఐదు ఎంపీ సెగ్మెంట్లలో బస్సు యాత్ర, పాదయాత్రను రాహుల్ గాంధీ చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. రామంజపురంలో మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మహిళా డిక్లరేషన్‌ను రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ద్వారా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ నిరుద్యోగులతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. ప్రవళిక కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు పరామర్శించనున్నారు. ప్రియాంక, రాహుల్ గాంధీ పర్యటనల ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యవేక్షించారు.
Updated Date - 2023-10-17T17:19:40+05:30 IST