TS News: చివరి శుక్రవారం.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2023-04-21T12:24:11+05:30 IST

నేడు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

TS News: చివరి శుక్రవారం.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్: నేడు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని చార్మినార్ (Charminar) వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా మోహరించారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా జుమాతుల్ విధా నిర్వహిస్తారు. జమాతుల్ విధా సందర్భంగా మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభంకానున్నాయి. ఇందు కోసం ముస్లిం పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరోవైపు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు. చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేష్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లించనున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు. అదేవిధంగా హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు. మక్కా మసీదుకు వచ్చే భక్తుల వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేశామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-04-21T12:24:11+05:30 IST