ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి కేసీఆర్‌కు చలి జ్వరం

ABN, First Publish Date - 2023-09-30T16:56:24+05:30

బీఆర్ఎస్ ప్రభుత్వం,మంత్రి కేటీఆర్‌పై ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం,మంత్రి కేటీఆర్‌పై ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్విట్‌కు రి ట్విట్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది?. పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు.. దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ నాన్ననే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు.. లిక్కర్ స్కామ్‌లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు.. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. మీనాన్న వల్ల కూడా కాదు’’ అని రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు.

Updated Date - 2023-09-30T16:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising