Nallu Indrasena Reddy: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఫైర్
ABN , First Publish Date - 2023-06-05T18:53:39+05:30 IST
బీజేపీ(BJP)పై రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలను బీజేపీ (BJP) నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy) ఖండించారు.
హైదరాబాద్: బీజేపీ(BJP)పై రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలను బీజేపీ (BJP) నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy) ఖండించారు. బీజేపీ ఉండదంటూ పగటి కలలు కంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన పార్లమెంట్, జీహెచ్‌ఎంసీ, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కంటే మెరుగైన ప్రదర్శన బీజేపీ చేసిందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేని పార్టీ అంతరించిన పోతున్న పార్టీ అన్నారు. బీజేపీ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమని నల్లు ఇంద్రసేనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, ఢిల్లీ, వెస్ట్బెంగాల్లో కాంగ్రెస్కు ఉన్న సీట్ల సంఖ్య సున్నా అని విమర్శించారు.