విజయవాడకు 50 విద్యుత్తు బస్సులు

ABN , First Publish Date - 2023-05-16T03:16:43+05:30 IST

ఏటా రూ. వెయ్యి కోట్ల నిధులను సమకూరుస్తాం’’.. ‘‘ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు నేనే స్వయంగా పర్యవేక్షణ చేస్తాను’’.. ‘‘మహిళా ఉద్యోగులకు డిపోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం’’.. ..

విజయవాడకు  50 విద్యుత్తు బస్సులు

హైదరాబాద్‌–బెజవాడ మార్గంలో

ప్రతి 20 నిమిషాలకో ‘ఈ–గరుడ’

తొలుత నేటి నుంచి 10 బస్సులు

ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

ఏడాది చివరికి మిగతా నలభై..

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలు.. కార్లు.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయ్‌! ఇక బస్సుల వంతు. అవీ ఆర్టీసీ బస్సులు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకూ ఒక ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని నిర్ణయించగా.. తొలి విడతలో 10 బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగతావి ఈ ఏడాది చివరికల్లా రోడ్లపైకి వస్తాయి. తొలి 10 బస్సులనూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు.. మియాపూర్‌ క్రాస్‌రోడ్‌లోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌.. జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్‌ బస్సులకు టీఎస్‌ఆర్టీసీ.. ‘ఈ–గరుడ’ బస్సులుగా నామకరణం చేసింది.

‘ఈ–గరుడ’ ప్రత్యేకతలు..

12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను హైటెక్‌హంగులతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్దా మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు రీడింగ్‌ ల్యాంప్‌లు ఉంటాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్దా ప్యానిక్‌ బటన్‌ ఏర్పాటు చేశారు. వాటిని టీఎస్‌ ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ప్రతి బస్సులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌, సప్రెషన్‌ సిస్టమ్‌ను (ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు ఫుల్‌ చార్జింగ్‌తో 325 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-16T03:16:43+05:30 IST