Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:06 PM
హైదరాబాద్ మెట్రో రెండో దశ, మూసీ రివర్ అభివృద్ధి ప్రాజెక్ట్ వంటి ప్రధాన అంశాలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం హామీలు, వివిధ పనులకు సంబంధించి నిధుల మంజూరు, అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‍లో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు హామీలపై చర్చించిన ఎంపీలు .. కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెుత్తం 28 అంశాలపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించారు.
మెట్రో రెండో దశ, మూసీ రివర్ అభివృద్ధి ప్రాజెక్ట్, బేపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం సహా పలు ప్రధాన అంశాలను అందులో పొందుపర్చారు. వీటికి కేంద్రం అనుమతులు, నిధులు మంజూరు చేసేలా తెలంగాణ ఎంపీలు పావులు కదపనున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా కాంగ్రెస్ ఎంపీలు కాగా.. బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు మాత్రం గైర్హాజరయ్యారు. సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా వారిద్దరూ హాజరు కాలేదు.
ఆ 28 అంశాలు ఇవే..
ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఆమోదం, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ రేడియల్ రోడ్ల అభివృద్ధి
మెట్రో రెండో దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, బేపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం
గోదావరి-మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్
వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకూ గ్రీన్‌ఫీల్డ్ హైవే
ఎస్‍సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, ఐపీఎస్ కేడర్ సమీక్ష
పీఎస్‍డీఎఫ్ కింద పథకాల మంజూరు, పీఎం కుసుమ్-ఏ, బీ, సీ కింద కేటాయింపు
తాడిచెర్ల బొగ్గు బ్లాక్-II మైనింగ్ లీజు, వివిధ కార్పొరేషన్లు/ఎస్‍పీవీల రుణ పునర్నిర్మాణం
వర్తించే ఇంటర్‌తో GOTGకి చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని విజ్ఞప్తి
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద GoTGకి చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల కోసం అభ్యర్థన
2014-15 ఆర్థిక సంవత్సరానికి సీఎస్ఎస్ నిధుల విడుదలలో లోపాన్ని సరిదిద్దమని అభ్యర్థన
ఏపీబిల్డింగ్, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధిలో తెలంగాణకు వాటా కోసం నిధులను బదిలీ చేయాలని అభ్యర్థన
ఏపీ పవర్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన మొత్తానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, రాష్ట్రంలో రైళ్ల కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి
ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వెనకబడిన ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం
పీఎం మిత్రా పార్క్ పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు
అన్‌కవర్డ్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.