Bandla Ganesh : నాలుగు నెలలు ఆగండి.. ఎన్నికల ముందు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన బండ్ల గణేష్
ABN, First Publish Date - 2023-07-20T17:40:57+05:30
సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. 2018 ఎన్నికల ముందు పొలిటికల్‌గా చాలా హడావుడి చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల్లో.. ప్రెస్‌మీట్‌ల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో కోసుకుంటానని చేసిన కామెంట్స్.. ఎంటర్‌టైన్మెంట్ చేశాయి.!
హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేష్ (Tollywood Producer Bandla Ganesh) మరోసారి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. 2018 ఎన్నికల ముందు పొలిటికల్‌గా చాలా హడావుడి చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో (Congress) చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల్లో.. ప్రెస్‌మీట్‌ల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో కోసుకుంటానని చేసిన కామెంట్స్.. ఎంటర్‌టైన్మెంట్ చేశాయి.! తదనంతరం 2019, ఏప్రిల్ 5న రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. అప్పట్నుంచీ సైలెంట్‌గా ఉంటున్నారు. మరోసారి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనసు మార్చుకున్నారో.. ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేస్తున్న పొలిటికల్ కామెంట్లు చేస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో బండ్ల గణేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి (TS Politcs) రాబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
గత మూడ్రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే హైదరాబాద్ కూడా భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి మరీ దారుణం. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో 20 నిమిషాల ప్రయాణానికి గంట, రెండు గంటల సమయం పడుతోంది. దీంతో భాగ్యనగరంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
బండ్ల గణేష్ ట్వీట్ ఇదే..
‘‘నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం. ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటాం. దయచేసి ఈ నాలుగు నెలలు భరించండి.’’ అంటూ హైదరాబాదీలకు బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కామెంట్స్‌పై చిత్రవిచిత్రాలుగా రిప్లయ్‌లు వస్తుండగా.. కొందరు మాత్రం బండ్లన్నకు సపోర్టుగానే కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-20T17:59:16+05:30 IST