ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinod Kumar: జమిలి ఎన్నికలపై మోడీ సర్కార్‌వి అన్ని డ్రామాలే..

ABN, First Publish Date - 2023-09-04T21:53:07+05:30

మిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్‌(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు.

హైదరాబాద్: జమిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్‌(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు. సోమవారం నాడు ఏబీఎన్‌తో మాట్లాడుతూ..భారత్ అన్ని రాష్ట్రాల కలయిక అని చెప్పారు. జమిలి ఎన్నికల సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌(Ram Nath Kovind)తో కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉంది. భారత రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి రాజకీయ పరమైన అంశాల్లో ఉండకూడదు. కమిటీలో దక్షిణ భారతదేశం నుంచి ఎవరికీ చోటు కల్పించక పోవడం దేనికి సంకేతం.ఇప్పటికే నిర్ణయించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల(Sessions of Parliament) పేరిట హడావుడి చేస్తుంది.2018లోనే లా కమిషన్‌కు జమిలిపై బీఆర్ఎస్ ప్రభుత్వం అభిప్రాయాన్ని చెప్పింది.ఇప్పటికిప్పుడు మరోసారి నిర్ణయం చెప్పాలంటే కుదరదు.సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం చెప్తారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటరని అనుకోం.తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయని అనుకోను.. ఎందుకంటే జమిలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదని వినోద్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-09-04T21:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising