Pawan Kalyan: ఇంటి వద్ద మహిళ హల్‌చల్
ABN , First Publish Date - 2023-01-06T12:09:27+05:30 IST
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు

హైదరాబాద్/బంజారాహిల్స్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 35లో పవన్‌కళ్యాణ్ నివాసం వద్దకు గురువారం జోషి కమల అనే మహిళ వచ్చింది. తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరగా.. నిరాకరించారు. దీంతో ఆమె కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఇలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో సాయిధరమ్‌తేజ్ నివాసానికి కూడా వెళ్లి హల్‌చల్ చేసిందని తెలిపారు.