ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharmila Counter: ఇప్పటికైనా నాకు తెలంగాణతో సంబంధం ఉందని ఒప్పుకుంటావా సజ్జల?

ABN, First Publish Date - 2023-11-06T13:29:06+05:30

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు.

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (AP Government Adviser Sajjala Ramakrishna Reddy) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పరిస్థితి ఎలా ఉందో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రతీ బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం అని సజల్జ అన్నారని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం ఉందని సజ్జల ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ (Andhrapradesh State) పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిది తెలంగాణ గురించి వాళ్లకు అనవసరమన్నారు. లెఫ్ట్ పార్టీల దగ్గరకు వెళ్లి మద్దతు అడుగుతున్న కాంగ్రెస్ (Congress) నేతల్లో కొందరికి పదవి భయం పట్టుకుందని తెలిపారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది నిజమని.. దానికోసం ప్రచారం కూడా చేస్తానని వెల్లడించారు. కొన్ని కారణాల వాళ్ళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకున్నామని.. కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-06T13:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising