Jupalli: కేసీఆర్ గురించి గద్దర్ చెప్పిన విషయాన్ని బయటపెట్టిన జూపల్లి
ABN, First Publish Date - 2023-08-09T18:40:09+05:30
గద్దర్‌తో తాను కలిసినప్పుడు సీఎం కేసీఆర్ (KCR) రెండు సంవత్సరాలపాటు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గద్దర్ చెప్పాడని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తెలిపారు.
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా: గద్దర్‌తో తాను కలిసినప్పుడు సీఎం కేసీఆర్ (KCR) రెండు సంవత్సరాలపాటు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గద్దర్ చెప్పాడని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తెలిపారు. ఉద్యమానికి ఉపిరి యుద్ధ నౌక గద్దర్ మరణం చాలా బాధాకరమని జూపల్లి అన్నారు.
"గద్దర్ పాటతోనే నా పాదయాత్ర ప్రారంభం అయ్యేది. ప్రభుత్య లాంఛనలతో దహన సంస్కరణ చేయడం సంతోషం. కానీ బ్రతికినప్పుడు గౌరవం ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.5 లక్షలు పోయి 3 లక్షలు చేశారు. పేదవారికి 75 గజాలు, మీ ఫామ్ హౌస్‌కు వంద ఎకరాలా. ప్రజలను అప్పులపాలు చేయడానికే ప్రభుత్య స్కీములు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. ఎన్నికలు మూడు మాసాలే, ప్రజావాణి మోసం చేయడానికే కొత్త కొత్త స్కీములు. ఆట మొదలైంది. బి.ఆర్.యస్ పార్టీ భారతం పట్టే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ధైర్యం డబ్బు, ఓటర్లను, నాయకులను, కార్యకర్తలను కొట్టామని ధీమా. బి.ఆర్.యస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇస్తాం. ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి. గృహలక్ష్మి పథకం గడువు 15 రోజులు పెంచాలి. రూ. 3 లక్షలు కాదు. రూ. 5 లక్షలు ఇవ్వాలి." అని ప్రభుత్వాన్ని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-08-09T18:41:33+05:30 IST