ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR Birthday: కేటీఆర్ మెప్పు కోసం బీఆర్ఎస్ లీడర్ల దిగజారుడుతనం.. విద్యార్థులతో...

ABN, First Publish Date - 2023-07-25T17:08:43+05:30

సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు.

నాయకులు, ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈరోజు ఉంటారు.. రేపన్న రోజు కనుమరుగువుతుంటారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఇలా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. కాకపోతే ఎవరు అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉంటారు. నాయకులను మెప్పించాలని శ్రేణులు ఉబలాటపడుతుంటారు. లీడర్ల కోసం వాళ్లు ఏమైనా చేయొచ్చు. అంతేకాని వీటిల్లోకి విద్యాకుసుమాలను లాగడం మాత్రం బాధాకరం. విచారకరం. నేటి బాలలే.. రేపటి పౌరులు అన్నారు. వారిని ఇబ్బంది పెట్టడం అంత సబబు కాదు. అలాంటిది నాయకుల బర్త్‌డే కార్యక్రమాల కోసం లేనిపోని విన్యాసాలతో ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ (Cm kcr) తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు (KTR Birthday). ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో లోకల్ బీఆర్ఎస్ నేతలు (BRS leaders) వినూత్నంగా కేటీఆర్‌కి విషెస్ చెప్పించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా కార్యక్రమాలను నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలతో చేయించిన యాక్టివిటీస్‌పై కాంగ్రెస్ నేతలు (Congress leaders) మండిపడుతున్నారు. కేటీఆర్‌ బర్త్‌డేకు విద్యార్థులను ఉపయోగించడమేంటి? అని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీలో కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, దర్పల్లి రాజశేఖర్, తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-25T17:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising