Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీక్ వీరులు, లిక్కర్ వీరులు..
ABN, First Publish Date - 2023-04-07T09:38:41+05:30
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల
Karimnagar: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) కరీంనగర్ జైలు(Karimnagar Jail) నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మంత్రి కేటీఆర్‌ను(Minister KTR) బర్తరఫ్(dismissal) చేయాలి. పేపర్ లీక్‌పై(Paper leak) సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష భృతి ఇవ్వాలి. హిందీ పేపర్‌ను(Hindi paper) ఎవరైనా లీక్ చేస్తారా?. మరి తెలుగు పేపర్‌ను(Telugu paper) ఎవరు లీక్ చేశారు?. పరీక్ష కేంద్రంలోకి ఫోన్ ఎలా పోయింది. సీపీ(CP) ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలి. పేపర్ లీక్‌కు, మాల్ ప్రాక్టీస్‌కు తేడా ఏంటో సీపీకి తెలియదా?. TSPSC ఇష్యూను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్ర. త్వరలో వరంగల్‌లో నిరుద్యోగ యువతతో(Unemployed youth in Warangal) భారీ ర్యాలీ చేస్తాం. లిక్కర్, డ్రగ్స్(Liquor, drugs) దందా ఎవరు చేస్తున్నారో అందరరికీ తెలుసు. కేసీఆర్ (KCR) కుటుంబంలోనే లీక్ వీరులు, లిక్కర్ వీరులు..హరీష్‌రావు(Harish Rao) నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. యువత భవిష్యత్‌ను నాశనం చేస్తుంటే ప్రశ్నించకూడదా?..మీరిచ్చిన హామీలపై ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటారా?. తాగు, తాగించు అనేదే బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ విధానం’’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కాగా..‘‘ రానున్న రోజుల్లో కవిత జైలుకు వెళ్తుంది..తర్వాత కేటీఆర్‌ను రెడీ చేస్తున్నాం. యువత భవిష్యత్‌ను నాశనం చేస్తుంటే ప్రశ్నించకూడదా?. కేసీఆర్ కొడుకు పెద్ద మూర్ఖుడు. కేటీఆర్‌కు లవంగానికి, తంబాకుకు తేడా తెలియదు. మీరిచ్చిన హామీలపై ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటారా?. బీజేపీ సంఘటిత శక్తి ఏంటో రేపు మోదీ సభలో చూపిద్దాం. మంత్రి హరీశ్‌కు అగ్గిపెట్టే ఎందుకు దొరకలేదు నీకు..నీ మీద మర్డర్ కేసు పెట్టాలి. కేటీఆర్‌ను సీఎం చేస్తే..మొదటి జంప్ హరీశ్‌రావే. మోదీ సభను అడ్డుకుంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్టే. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకే మోదీ తెలంగాణ పర్యటన. వందేభారత్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ.. పలు అభివృద్ధి పనుల ప్రారంభానికే ప్రధాని వస్తున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక పాలనపై..దృష్టి మరల్చేందుకు రచ్చ చేసే ప్రయత్నం..ప్రధానిని అడ్డుకోవాలనే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలి’’ అని తీవ్ర స్థాయిలో సంజయ్ విమర్శించారు.
Updated Date - 2023-04-07T10:35:31+05:30 IST