ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MIM VS BJP: కరీంనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత.. కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-09-29T19:43:40+05:30

జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్‌(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

కరీంనగర్: జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్‌(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. కావాలనే ఎంపీ సంజయ్ కార్యాలయం వద్ద ఓ వర్గం నేతలు ఆరోపణలు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతల తీరుపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. బీజేపీ నేతలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. కాగా నిరసన తెలుపుతున్న కమలం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. పోలీసులు సర్ధి చెప్పడంతో బీజేపీ నేతలు శాంతించారు.

చూస్తు ఊరుకోం: కిషన్‌రెడ్డి

కాగా.. ఈఘటనను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఖండించారు. ఎంఐఎం నేతల తాటాకు చప్పుళ్లకు బండి సంజయ్ భయపడరు. ఎంఐఎం దుందుడుకు చర్యలను చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులుదేనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T19:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising