ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: ఇది ప్రజల తెలంగాణ కాదు.. దొరల తెలంగాణ

ABN, First Publish Date - 2023-10-19T15:06:02+05:30

ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం మంథనిలో రాహుల్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాదు, రాజులా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ కుటుంబ సభ్యులకే న్యాయం జరుగుతోందన్నారు.

పెద్దపల్లి: ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) అన్నారు. గురువారం మంథనిలో రాహుల్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాదు, రాజులా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ (CM KCR) కుటుంబ సభ్యులకే న్యాయం జరుగుతోందన్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని విమర్శించారు. లక్ష కొట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని.. కానీ వారి కుటుంబానికి మాత్రం మేలు జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ - బీజేపీ - ఎంఐఎం ఒక్కటే అని మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారన్నారు. ఆయనపై బీజేపీ (BJP) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు ఒక్కటే, బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఉందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి సహకరిస్తోందన్నారు. తాము ఆర్ఎస్‌ఎస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. నరేంద్ర మోదీ వద్ద కేసీఆర్ చేతులు కట్టుకుని ఉంటున్నారని.. బీజేపీపై ధైర్యంగా పోటీ చేస్తోంది కాంగ్రెస్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. తనలో ప్రవహించే రక్తం కాంగ్రెస్ పార్టీ ది అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై ఎంత కక్ష సాధిస్తే తనకు అంతమంచిదని తెలిపారు. ‘‘తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ బంధం. నేను నిన్న నా సోదరి ప్రియాంకను తీసుకొచ్చా. మా నాయనమ్మ ఇందిరాతో తెలంగాణకు అనుబంధం ఉంది’’ అని ఆయన తెలిపారు.


అబద్దాలు చెప్పేందుకు తెలంగాణకు రాలేదు..

‘‘నరేంద్ర మోదీ ప్రతి కుటుంబానికి 15లక్షలు వేస్తా అన్నారు. జీఎస్టీతో పేద వారికి న్యాయం చేస్తానని మోసం చేశారు. కేసీఆర్ పేదలకు 3ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారు. నేను అబద్దాలు చెప్పేందుకు తెలంగాణకు రాలేదు. నేను అనుబంధంతో వచ్చాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 2500 వేస్తాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. రాహుల్ గాంధీ అబద్దం ఆడరు, నిజం తెలుసు కోవాలంటే కర్ణాటక వాళ్లను అడగండి. ఈ దేశం లో అన్ని వర్గాల ప్రజలున్నారు. దేశ సంపదలో వాటా ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుతున్నాము. తెలంగాణలో సంపద ఏమవుతుందో తెలుసుకోండి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు చెప్పడం లేదు. ఓబీసీ జనాభా ఎంతో చెప్పాలని పార్లమెంట్‌లో అడిగితే సమాధానం రాలేదు. ఇవాళ దేశం మొత్తాన్ని 90 మంది అధికారులు నడిపిస్తున్నరు. తెలంగాణలో కూడా 70 మంది అధికారులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సీఎం ఆదేశిస్తే ఆ అధికారులు అమలు చేస్తున్నారు’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-19T15:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising