ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Errabelli VS Revanth: నాకు చదువు రాదు నిజమే.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..

ABN, First Publish Date - 2023-02-17T14:07:48+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Reavath Reddy) ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Minister Errabelli Dayakarrao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి (TPCC Chief) పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దన్నారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన తండ్రి 1600ఎకరాలు సంపాదించారని... ఇప్పడు వంద ఎకరాలే మిగిలిందని తెలిపారు. ‘‘నీది బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జనగామ జిల్లా, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారని... పాదయాత్ర అని చెప్పి కార్లలో తిరుగుతున్నారని అన్నారు. టీడీపీలో తాను 15 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు (TDP leader Chandrababu Naidu) ను ఒప్పించి లెటర్ అందజేసిన వారిలో మొదటి వ్యక్తిని అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి కోవార్ట్‌గా పని చేశారన్నారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో రేవంత్‌రెడ్డిపై గాని, రాఘవరెడ్డిపైన ఒక్కకేసు లేదని తెలిపారు. తెలంగాణ కోసం తాను జైలుకు కూడా వెళ్లినట్లు చెప్పారు. ‘‘నాకు చదువు రాదు అంటున్నాడు... అవును నేను ఇంటర్ మీడియట్ చదివినాను అదే చాలా సార్లు చెప్పాను’’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

ఎర్రబెల్లి చదువుపై రేవంత్ కామెంట్ ఇదే....

కాగా.. ‘‘హాథ్‌ సే హాథ్’’ జోడో యాత్రలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గంలో రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించిన సభలో మంత్రిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎర్రబెల్లి చదువుపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఎర్రబెల్లి ఓనమాలు, ఏబీసీడీలు రాస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. టీడీపీని ముంచిన దుర్మార్గుడన్నారు. ఎర్రబెల్లికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని.. కానీ ఎర్రబెల్లి కోవర్టులా మారి టీడీపీ తీరని అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2023-02-17T14:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising