ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth: ‘తండ్రి, కొడుకు, కూతురు.. దేవుళ్లను కూడా మోసం చేశారు’

ABN, First Publish Date - 2023-03-06T12:30:45+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ (TPCC Chief) ముందుగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొండగట్టుకు తక్షణం రూ. 500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొండగట్టును అబద్ధాల వాగ్ధానాలతో సీఎం కేసీఆర్ (Telangana CM) మోసం చేశారన్నారు. కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేశారని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు దేవుళ్లను కూడా మోసం చేశారని వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు బస్సు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం కోడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్‌ (Potharam Reservoir)ను రేవంత్ పరిశీలించారు. ఎనిమిదేళ్లుగా రిజర్వాయర్ పనులు జరగడంలేదని ఈ సందర్భంగా స్థానికులు తెలియజేశారు. మత్తడి నిర్మాణం, బ్రిడ్జ్ నిర్మాణం, 135 బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ... పోతారం రిజర్వాయర్‌‌కు రూ.25 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తి అవుతాయని తెలిపారు. పనులు పూర్తయితే కొనాపూర్, సూరంపేట, పోతారం, కొడిమ్యాల రైతులకు నీళ్లు అందించవచ్చని రైతులు తెలిపారు.

Updated Date - 2023-03-06T12:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising