ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam : ఈడీ ఎదుట హాజరైన కవిత

ABN, First Publish Date - 2023-03-11T11:14:17+05:30

ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. నేడు ఈడీ ఆమెను ఈడీ విచారించనున్నారు. ఆమెతో పాటు ఒక న్యాయవాది సైతం వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. నేడు ఈడీ ఆమెను ఈడీ విచారించనున్నారు. ఆమెతో పాటు ఒక న్యాయవాది సైతం వెళ్లారు. సీఎం కేసీఆర్ నివాసం నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి ముందు తన సోదరుడు మంత్రి కేటీఆర్, హరీష్‌రావులతో భేటీ అయ్యారు. ఉదయం నుంచే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద హడావుడి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు పెద్ద ఎత్తున కవితకు మద్దతు తెలిపారు.

ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?

కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముందని ఈడీ వర్గాలు తెలిపాయి. విడిగా కూడా కవితను ప్రశ్నిస్తారు. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న క్రమంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా మందిని ఈ కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది.

Updated Date - 2023-03-11T11:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising