TS NEWS: భద్రాద్రి రాముడిని దర్శిచుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
ABN, First Publish Date - 2023-12-10T23:00:59+05:30
భద్రాచలంలో రాముడు కొలువై ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు భద్రాద్రి రామాలయాన్ని భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో ఈవో రమాదేవి స్వాగతం పలికారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో రాముడు కొలువై ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు భద్రాద్రి రామాలయాన్ని భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో ఈవో రమాదేవి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘ప్రజలు కోరుకునే పాలన అందించిన రాజు రాముడు. రాష్ట్రం, దేశంలో పాలకులకు రాముడు ఆదర్శం. తానీషా కాలం నుంచి రాముడు కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే ఆనవాయితీ ఉంది. సమ సమాజం ఉండేలా పాలన ఉండాలని రాముడు దీవించాలని కోరుకున్నాం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
వ్యవసాయం బావుండాలి: మంత్రి తుమ్మల
రామరాజ్యం తలపించే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో వ్యవసాయం బావుండాలని కోరుకున్నాను. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి. వాస్తు ఆగమ నియమాలు పాటిస్తూ మాడ వీధులు విస్తరణ చేపట్టాలని కలెక్టర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రామరాజ్యంమే ప్రజారాజ్యం: మంత్రి పొంగులేటి
నరరూప రాక్షస పాలన అంతమొందించి ప్రజాపాలన ఇచ్చిన భద్రాద్రి రామచంద్ర ప్రభువును కృతజ్ఞతతో దర్శనం చేసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో రామరాజ్యంమే ప్రజారాజ్యం.రామచంద్ర ప్రభువు దయతో ప్రజా పాలన చల్లగా చూడాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాగా.. ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ మర్యాద పూర్వకంగా కలిశారు.
Updated Date - 2023-12-10T23:02:00+05:30 IST