TS Politics: ‘రేవంత్ ఫస్ట్రేషన్‌లో ఉన్నాడు.. అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా.. రేగా హాట్‌ కామెంట్స్’

ABN, First Publish Date - 2023-02-10T12:12:59+05:30

రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్‌గా మారి హైదరాబాద్ భూములపై దందాలకు పాల్పడుతున్నారంటూ సభలో మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌మారింది.

TS Politics: ‘రేవంత్ ఫస్ట్రేషన్‌లో ఉన్నాడు.. అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా.. రేగా హాట్‌ కామెంట్స్’
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బ్లాక్‌మెయిలర్‌గా మారి హైదరాబాద్ భూములపై దందాలకు పాల్పడుతున్నారంటూ సభలో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ మారాయి. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్, రేవంత్ మధ్య మాటల యుద్ధం (War of words between KTR and Revanth) నడుస్తోంది. ఈ తరుణంలో రేవంత్‌పై పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Pinapaka MLA, Government Whip Rega Kantha Rao) ఫేస్ బుక్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ పాత మూలాలు అభ్యుదయం కాదు.. అరాచక మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌ తో కలిసి అనబోయి మావోలతో అన్నట్లున్నాడు.. ఫస్ట్రేషన్‌లో ఉన్నాడు. గాంధీ మహాత్ముడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో ఉండి.. గాడ్సే మాటలు మాట్లాడడం తగునా రేవంత్ గారు. రేవంత్ మతిభ్రమించిన మాటలకు బుద్ధి చెపుతాం.. ప్రజల ఆస్తులను కూల్చితే బీఆర్‌ఎస్ సైనికులుగా చూస్తూ ఊరుకుంటామా’’ అంటూ హెచ్చరిస్తూ రేగా కాంతారావు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2023-02-10T12:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising