Renuka Chowdhury: సీట్ల కేటాయింపుల్లో కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-10-07T15:17:08+05:30
సీట్ల కేటాయింపుల్లో కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chowdhury) విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ: సీట్ల కేటాయింపుల్లో కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chowdhury) విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌ని రేణుకాచౌదరి, ఖమ్మం, కమ్మ సామాజిక వర్గ నేతలందరం కలిశారు. ఈ సందర్భంగా రేణకాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమ్మ సామాజిక వర్గ సీట్ల గురించి మురళీధరన్‌ని కలిశామని.. వారు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామనని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చెయాలని వారు సూచించారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉంటా, సమావేశాల్లో పాల్గొంటా. మా దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉన్నాయి. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది.
Updated Date - 2023-10-07T15:17:08+05:30 IST