అయిజలో అలరించిన టిక్‌టాక్ దుర్గారావు దంపతులు
ABN , First Publish Date - 2023-02-18T23:39:36+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో టిక్‌టాక్ దుర్గారావు దంపతులు అలరించారు.

అయిజ, ఫిబ్రవరి 18 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో టిక్‌టాక్ దుర్గారావు దంపతులు అలరించారు. తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సినీ, టిక్‌టాక్, ఢీషో, టీవీ, డ్యాన్స్ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శివరాత్రి పర్వదినం కావటంతో భక్తులను అలరించేందు కోసం కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. భక్తులు రోజంతా శివరాత్రి జాగరణ చేస్తుండటంతో వారికి కాలక్షేపంగా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. టిక్‌టాక్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, టిక్‌టాక్ ఫేమ్ దుర్గారావు దంపతులు కళాప్రదర్శనలు నిర్వహించారు. యాంకర్ రేణు, రేలారే ప్రసాద్, మహేశ్వరి, జానపద గాయకుడు, కళాకారులచే ప్రదర్శనలు ఆహుతులను ఉత్తేజపరిచాయి. డ్యాన్స్, జానపద గేయాలు, భక్తిపాటలు, వారి వారి ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు కార్యక్రమం సాగింది.