Marri: నో డౌట్.. ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిదే గెలుపు..
ABN , First Publish Date - 2023-10-17T11:24:10+05:30 IST
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం(Rajendranagar Assembly Constituency)లో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని అన్ని

- అన్ని సర్వేలూ బీజేపీకి అనుకూలం..
రాజేంద్రనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం(Rajendranagar Assembly Constituency)లో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని అన్ని సర్వేలు చెబుతున్నాయని, ప్రతి కార్యకర్త ఐక్యంగా ముందుకుసాగి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అండగా ప్రచారం చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి(Former Minister Marri Shashidhar Reddy), కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే సీకే రామ్మూర్తి అన్నారు. సోమవారం నియోజకవర్గ కన్వీనర్ పి. మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన కాటేదాన్‌లోని టీఎల్‌ఎం గార్డెన్‌లో నిర్వహించిన సోమవారం బీజేపీ రాజేంద్రనగర్(Rajendranagar) అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మర్రి శశిధర్‌రెడ్డి, సి.కె రామ్మూర్తి మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేంరాజ్, వై.శ్రీధర్, ఎన్.మల్లారెడ్డి, ఎం.కొమురయ్య, కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్‌రెడ్డి, సంగీత గౌరీశంకర్, బి.మహలింగంగౌడ్, నరేందర్‌రెడ్డి, రాచూరి రాజశేఖర్, డి.సత్యనారాయణ ముదిరాజ్ పాల్గొన్నారు.