Congress MP: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పిన కోమటిరెడ్డి... ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-09-08T14:25:55+05:30
ధనిక తెలంగాణ నేడు అప్పుల తెలంగాణ, బతకలేని తెలంగాణ గా మారిందని కాంగ్రెస్ ఎంపజీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఎలా అప్పుల పాలయిందో నేడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో సమగ్ర కథనం ఇచ్చారన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలిసేలా వార్త రాసిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
సిద్దిపేట: ధనిక తెలంగాణ (Telangana State) నేడు అప్పుల తెలంగాణ, బతకలేని తెలంగాణ గా మారిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkatreddy) అన్నారు. శుక్రవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఎలా అప్పుల పాలయిందో నేడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో సమగ్ర కథనం ఇచ్చారన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలిసేలా వార్త రాసిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. దళిత, బీసీ, మైనార్టీ బందులన్నీ కేసీఆర్ దుకాణం బంద్ కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు. అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో కాదని.. జనగామ, స్టేషన్ ఘనపూర్‌లో చూడండి తమకే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అనే విరుచుకుపడ్డారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని రాజకీయం చేస్తే, తాము ప్రజల్ని నమ్ముకున్నామన్నారు. కొంగర కలాన్ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు భవిష్యత్ భరోసా ఇవ్వబోతున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-08T14:25:55+05:30 IST