ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: కోకాపేట భూములమ్మితే తప్ప.. జీతాలు ఇవ్వలేవా కేసీఆర్..?

ABN, First Publish Date - 2023-09-19T21:39:16+05:30

తెలంగాణ(Telangana)లోని కోకాపేట భూములు(Kokapet lands) అమ్ముకుంటే తప్ప జీతాలు, ఫెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.

సిద్దిపేట: తెలంగాణ(Telangana)లోని కోకాపేట భూములు(Kokapet lands) అమ్ముకుంటే తప్ప జీతాలు, ఫెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో బీజేపీ(BJP) జెండా ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్, స్ధానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ...‘‘ దేశంలోనే దనవంతమై న రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు.కేసీఆర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నడు.. పైసలు లేక మూడు నెలలు ముందే లిక్కర్ టెండర్లు పెట్టారు.అన్ని జమ చేసినా ఒక్క దుబ్బాక రైతులకు రుణమాఫీ పైసలు వచ్చాయా ?అభివృద్ధి కనిపించని వారికి కంటి వెలుగులో ఆపరేషన్ చేపిస్తామని మంత్రి హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉంది.నీ సిద్దిపేట గడ్డమీద కూసుందాం.. మాట్లాడుదాం దమ్ముంటే వస్తవా సిద్దిపేట మంత్రి?తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పొలాలకు 24 కరెంటు వస్తే ముక్కు నేలకు రాస్తా.. చూపిస్తావా?గతంలో ఒక ముఖ్యమంత్రి తన జిల్లాకు ఆరు వేల కోట్ల మంజూరు చేసుకుంటే నీ అబ్బ జాగీరా అని నిలదీశాం. కానీ ఈ ముఖ్యమంత్రి ఇళ్లు కట్టిన రోడ్డు వేసిన ఏ అభివృద్ధి చేసిన వారి సొంత నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకుంటాడు. ఉప్పిడి ఉపవాసం ఉండి పోరాటం చేసిన కేసీఆర్‌కు తొమ్మిదేళ్లో వేల కోట్లు ఎలా వచ్చాయి.

అక్రమంగా సంపాదించి మాలాంటోల్లను ఓడించాలనుకుంటారు.. కాని చరిత్రను మార్చింది దుబ్బాక, హుజురాబాద్ ప్రజలని గుర్తు పెట్టుకో. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత మోదీది. అయోధ్యలో రామాలయం కట్టిన ఘనత మోదీది. రైతుబంధు భూస్వాములకు వచ్చాయి తప్ప కౌలు రైతులు నిండా మునిగారు.10 లక్షల డబుల్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పాడు.బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది.కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈసారి కేసీఆర్‌ని ఓడించేందుకు సిద్ధం కావాలి.రాష్ట్రంలో ప్రజల కోసం ఎలాంటి ఆందోళనలకైనా మేం ముందుంటాం.. కటువైన పంచాయతీలకు రఘునందన్ రావు, సౌమ్యమైన పంచాయతీలకు నేను ఉంటా’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు

సీఎం కేసీఆర్(CM KCR) ప్రతిపక్ష శాసనసభ్యులకు అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అక్బర్‌పేట భూంపల్లి మండలం తెచ్చా.రఘునందన్‌రావు గెలిస్తే కేంద్రం నుంచి ఏం తెస్తారన్నారు ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు రోడ్డు తెచ్చా. నేను గెలిచిన తర్వాత రోడ్లు వేశారు. కూడవెల్లి దేవస్థానం అభివృద్ధి కోసం డబ్బులు తెచ్చేందుకు కృషి చేస్తే అది మేమే తెచ్చామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుతున్నారు. పోతరెడ్డిపేట చెరువు అభివృద్ధి కోసం పదికోట్లు ఇస్తానని చెప్పి మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) మాట తప్పాడు’’ అని రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-19T21:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising