KA Paul: మోదీ, కేసీఆర్, రాహుల్‌ను ఢీ కొట్టే శక్తి నాకే ఉంది
ABN, First Publish Date - 2023-08-17T17:10:24+05:30
తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి
సంగారెడ్డి: బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి నా చారిటీ మూయించారు. జగ్గారెడ్డిని ఇప్పటి వరకు క్షమించాను.. ఇక నుంచీ క్షమించను. వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరుతావా? అభివృద్ధి చేసే నా పార్టీలో చేరతావా?, కేసీఆర్... గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోలేదు. గద్దర్ చచ్చిపోతే అన్ని పార్టీల నాయకులు కుక్కల్లాగా వాలిపోయారు. మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేస్తున్నారు. కేటీఆర్ (KTR) గూగుల్‌ని కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా రేవంత్‌కి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కి అసలు ఓటు బ్యాంకే లేదు. ఆర్ఎస్ఎస్ (RSS) వల్లే రేవంత్‌ని టీ పీసీసీ చీఫ్‌ని చేశారు. మోదీ, కేసీఆర్, రాహుల్‌ని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్‌కే ఉంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్‌లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని మంత్రులు చెప్పారు.’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-08-17T17:10:24+05:30 IST