Jagadish Reddy: ‘కవితకు నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట’
ABN, First Publish Date - 2023-03-08T11:13:24+05:30
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు.
సూర్యాపేట: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కు ఈడీ నోటీసుల (ED Notice)పై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Guntakandla Jagadish Reddy) స్పందించారు. కవిత (BRS MLC)కు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ (Modi Government) దుర్మార్గాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్న కేసీఆర్ (CM KCR) పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని అన్నారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మోదీ (Prime Minister Narendra Modi) దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా... దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నుంచి నోటీసులు అందాయి. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) అంగీకరించారని ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నారు. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పదేపదే ఈడీ ప్రస్తావించింది. మరోవైపు.. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special Court) అనుమతించిన విషయం తెలిసిందే.
**************************************************************************
ఇది కూడా చదవండి
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు..
******************
Delhi Liquor Scam : కవిత అరెస్ట్‌పై ఊహాగానాలు.. కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ
******************
Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..
Updated Date - 2023-03-08T12:06:41+05:30 IST