Singareni Election: ప్రశాంతంగా ముగిసిన సింగరేణి పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ షురూ
ABN , Publish Date - Dec 27 , 2023 | 05:10 PM
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందనే వివరాలు అందాల్సి ఉంది.
కొత్తగూడెం: సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందనే వివరాలు అందాల్సి ఉంది. భూపాలపల్లిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ - కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. కాగా సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత ఇల్లందు ఏరియా ఫలితం వెలువడనుంది. శ్రీరాంపూర్ ఏరియా ఫలితం చివరన వెలువడనుంది. కాగా ఏఐటీయూసీ -ఐఎన్టీయూసీ సంఘాలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి.
సింగరేణి ఎన్నికల్లో 96.3శాతం పోలింగ్ నమోదైంది. భూపాలపల్లి సింగరేణిలో 94.7 శాతం పోలింగ్ నమోదు కాగా.. 5410 ఓట్లకు గాను,.. 5,123 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణిలో పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 9 పోలింగ్ సెంటర్లలో ఎన్నికలు జరిగాయి. భూపాలపల్లి డివిజన్‌లో మొత్తం 5410 మంది ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ అనుబంధ INTUC, సీపీఐ అనుబంధ AITUC సంఘాల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కోసం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం 7గంటలకు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 7గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడనుంది.