ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sunday: ఆదివారం ఎవరికి కలిసొచ్చేనో? విజయంపై ఎవరికి వారు ధీమా

ABN, First Publish Date - 2023-12-02T09:41:44+05:30

నెలరోజుల ఎన్నికల కష్టానికి పోలింగ్‌తో తెరపడింది. ఇప్పటి వరకు కష్టపడిన నాయకులకు గెలుపుపై ఆందోళన నెలకొంది. ముషీరాబాద్‌,

- గెలుపోటములపై అభ్యర్థుల లెక్కలు

- తగ్గిన పోలింగ్‌పై గుబులు

రాంనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నెలరోజుల ఎన్నికల కష్టానికి పోలింగ్‌తో తెరపడింది. ఇప్పటి వరకు కష్టపడిన నాయకులకు గెలుపుపై ఆందోళన నెలకొంది. ముషీరాబాద్‌, అంబర్‌పేట ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌ పట్టుకుంది. ఆదివారం(Sunday) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండడంతో అందరి ఆలోచన ఆ రోజుపైనే ఉంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. లోలోపల భయం పట్టుకుంది. రెండు నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం తగ్గడంతో ఇది ఎవరిపై ప్రభావం చూపుతుందో తెలియడం లేదు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 2018లో పోలింగ్‌ శాతం కంటే 2023లో పోలింగ్‌ రెండు శాతం తగ్గింది. గత ఎన్నికల్లో 52 శాతం పోలింగ్‌ ఉండగా ప్రస్తుతం 50.54 శాతానికి తగ్గింది. నియోజకవర్గంలో 3 లక్షలా 01 వేయి 788 ఓట్లు ఉండగా లక్షా 52 వేలా 551 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన ఓట్లలో ఏ అభ్యర్థి గెలవాలన్నా 50 నుంచి 60 వేల ఓట్లు వస్తే గెలిచే అవకాశం ఉందని ఆయా పార్టీల విశ్లేషకులు భావిస్తున్నారు. పోలైన ఓట్లలో తమ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే ఆంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎం.అంజన్‌కుమార్‌యాదవ్‌, ముఠా గోపాల్‌, పూస రాజు ఇతరులు నియోజకవర్గంలోని 289 పోలింగ్‌ బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఏజెంట్లు, బూత్‌ల బయట ఉన్న నాయకుల సమాచారం ప్రకారం ఏ బూత్‌లో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే లెక్కలు వేసుకుంటున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఆయా కులాల వారీగా లెక్కలు కడుతున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఓట్ల శాతం ఎంత వరకు జరిగింది, వారు ఎవరికి ఓటు వేశారనే అంశంపైనా లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని కాలనీ, అపార్ట్‌మెంట్‌వాసులు, మహిళా సంఘాలు, సమైఖ్య సభ్యులు ఎవరికి ఓటు వేశారో అనే అంశాలపై ప్రాంతాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. అంతే కాకుండా ఓటర్లకు ఏ పార్టీ వారు ఎక్కువ డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎంత మేరకు ప్రభావితం చేశారో అనేది విశ్లేషణ చేస్తూ ఆదివారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆదివారం జరిగే కౌంటింగ్‌పైనే ఆందోళన నెలకొంది. అంత వరకు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.

అంబర్‌పేటలో 52 శాతం

బర్కత్‌పుర: అంబర్‌పేట నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్‌ నమోదయింది. అయితే 40.69 శాతం పోలింగ్‌ అయిందని అధికారులు ముందుగా ప్రకటించగా.. కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ ఆలస్యంగా ముగియడంతో 52.50 శాతం నమోదయింది. 2018 ఎన్నికల్లో కూడా 52 శాతం నమోదు కావడం గమనార్హం. అంబర్‌పేట నియోజకవర్గంలో 2 లక్షలా 77 వేలా 103 ఓట్లు ఉండగా పురుషులు లక్షా 40 వేలా 206, మహిళలు లక్షా 36 వేలా 883 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. గురువారం 73 వేలా 534 మంది పురుషులు, 71 వేలా 234 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం లక్షా 45 వేలా 470 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బర్కత్‌పురలోని రెడ్డి కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక్కడ కేంద్ర బలగాలతో భద్రత ఉన్నట్టు ఆర్‌వో అపర్ణ, ఈఆర్‌వో మారుతిదివాకర్‌ తెలిపారు.

ముషీరాబాద్‌లో 50.54 శాతం పోలింగ్‌

గురువారం జరిగిన ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 50.54 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు. నియోజకవర్గంలో 3 లక్షల ఒక వెయ్యి 788 ఓట్లు ఉండగా వీటిలో లక్షా 52 వేలా 551 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషులు 78 వేలా 685 మంది, మహిళలు 73 వేలా 863 మంది ఓటు వేశారు. అదే విధంగా ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 289 పోలింగ్‌ బూత్‌లలో 578 ఈవీఎంలను వినియోగించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొ త్తం 31 మంది అభ్యర్థులు పోటీచేసినట్లు తెలిపారు. ఈవీఎంలలో 31 మంది అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తింపు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్‌ ఆదివారం దోమలగూడలోని ఏవీ కళాశాలలో ప్రారంభమవుతుందని ఆర్‌వో తెలిపారు.

Updated Date - 2023-12-02T09:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising