TS News: ‘నక్సలైట్లకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’

ABN , First Publish Date - 2023-02-08T19:44:28+05:30 IST

రేవంత్రెడ్డి (Revanth Reddy) పీసీసీ పదవికి అనర్హుడని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) విమర్శించారు.

TS News: ‘నక్సలైట్లకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’

హైదరాబాద్: రేవంత్రెడ్డి (Revanth Reddy) పీసీసీ పదవికి అనర్హుడని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) విమర్శించారు. వ్యవస్థలపై రేవంత్రెడ్డికి నమ్మకం లేదన్నారు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్సే అన్నారు. రేవంత్రెడ్డివి అహంకారపు మాటలని సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, నక్సలైట్లకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

ప్రగతిభవన్‌‌ను (Bragathi Bhavan) కూల్చివేయాలన్న తన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు (BRS Leader) ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ‘‘నేను కేసులకు భయపడను.. నాకు కేసులు కొత్త కాదు. కేసీఆర్ భూతం లాంటివారు... పట్టి సీసాలో బంధించాలి.... లేకపోతే తట్టుకోలేం’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌కు (Congress) సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు అనమతి లేని ప్రగతిభవన్ ఎందుకని మరోసారి నిలదీశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సిద్ధాంతం మంచిదే అని... ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదన్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాని (KCR Government)కి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులు అప్పజెప్పారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ములుగు జిల్లాలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath se Hath Jodo Yatra) భాగంగా ప్రగతిభవన్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పేదలకు ఉపయోగం లేని ప్రగతిభవన్ ఎందుకని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని అన్నారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రేవంత్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.

**********************************

ఇవి కూడా చదవండి

ABK Prasad: సీనియర్ జర్నలిస్ట్ ఏబికె ప్రసాద్‌‌కు ప్రతిష్టాత్మకమైన అవార్డు

Seethakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

Etela Rajender: ఆ సమయంలోనే మైక్ కట్ అవుతుందని ఈటల ఆగ్రహం

CM KCR: కేసీఆర్ ఫామ్హౌజ్లో తాంత్రిక పూజలు చేయ్యం కానీ..: హరీశ్

Updated Date - 2023-02-08T19:44:31+05:30 IST