Khammam: పువ్వాడ పాలనలో ఖమ్మంలో కబ్జాలు పెరిగిపోతున్నాయి: తుమ్మల నాగేశ్వరరావు
ABN, First Publish Date - 2023-11-12T11:26:12+05:30
మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు.
ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు. రఘు నాథ పాలెం మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తుమ్మల మాట్లాడుతూ..
"పువ్వాడ లోకల్ అంటున్నారు లోకల్ అయితే అక్రమంగా గుట్టలు తవ్వుకోవచ్చా? సాగర్ కాలువ భూములు కబ్జా చేయొచ్చా? అజయ్ తండ్రి గురించి ప్రజలకు తెలియదా? ఆయన ఊరు కూనవరానికి నా హయాంలోనే హైలెవల్ బ్రిడ్జి మంజూరయింది. మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో జిల్లా అభివృద్ధికి బాటలు వేశా. ఖమ్మం(Khammam)లో ట్రాఫిక్ కష్టాలు తలెత్తకుండా రింగ్ రోడ్డుకు ప్రణాళిక వేశాను. నాగపూర్ టు అమరావతి జాతీయ రహదారి వల్ల ఎకరా రూ.పది కోట్లకు పెరిగింది. ఖమ్మం అభివృద్ధిపై విజన్ తో పని చేశా. నా రాజకీయ జీవితం లో ఎన్నడూ చూడని అరాచకం, అవినీతి, కబ్జాలు ఖమ్మం లో రాజ్య మేలుతున్నాయి" అని విమర్శించారు.
రాష్ట్ర ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో నిజమైన దీపావళి వస్తుందని అన్నారు.
Updated Date - 2023-11-12T11:27:19+05:30 IST