ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: రంగంలోకి దిగిన కేటీఆర్.. ఈసారి జనగామ నుంచి బరిలో నిలిచేదెవరంటే..

ABN, First Publish Date - 2023-09-23T17:53:46+05:30

బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం కొన్ని రోజుల ముందు అసెంబ్లీ సీట్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సీట్లపై సీఎం కేసీఆర్(CM KCR)దృష్టి సారించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Ministers KTR and Harish Rao) రంగంలోకి దిగారు.

జనగామ: బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం కొన్ని రోజుల ముందు అసెంబ్లీ సీట్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సీట్లపై సీఎం కేసీఆర్(CM KCR)దృష్టి సారించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Ministers KTR and Harish Rao) రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాలల్లోని నేతలతో కేటీఆర్(KTR) మంతనాలు చేస్తున్నారు. వారికి ఏదో ఒక హామీని ప్రకటిస్తూ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌తో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (MLA Muthireddy Yadagiri Reddy) సమావేశమయినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ అసెంబ్లీ టికెట్‌‌(Janagama Assembly Ticket)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కేటీఆర్ నిర్ణయం పైనే..

‘‘జనగామ బీఆర్ఎస్ టికెట్‌పై సీఎం కేసీఆర్(CM KCR) ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్(Minister KTR) నిర్ణయం తీసుకుంటారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా వారి ఆదేశాల మేరకు పనిచేస్తా’’ అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. కాగా గతంలో జనగామ టికెట్ కోసం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య కుమ్ములాటలు జరిగిన విషయం తెలిసిందే.


అసంతృప్తులకు గౌరవ పదవులు..

రాబోయే ఎన్నికల్లో పార్టీ ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే.. కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారో ఆ నేతకు సహకరించాలని మంత్రి కేటీఆర్ ముత్తిరెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా పార్టీలో గౌరవ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి జనగామ టికెట్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వర్గ రాజకీయాలు నడుస్తోన్నాయి. ఎన్నికల ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఈ నియోజకవర్గంలో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముండే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ అధిప్ఠానం భావిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇకపై కేటీఆర్ స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేకుండా పనిచేయాలని ఈ ఇద్దరు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. సయోధ్యలో భాగంగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

రాజయ్యను బుజ్జగించేందుకు..

కాగా.. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాజయ్య ఈ ప్రకటన చేశారు. రాజయ్యకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అటు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. TSRTC చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను నియమించే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిన్న పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో అక్కడ కూడా మరో అభ్యర్థిని ప్రకటించడానికి ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శాంతపరచడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగైదు రోజుల్లో సీఎం కేసీఆర్‌ నుంచి ఈ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2023-09-23T19:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising