ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Ministers: కవితకు ఈడీ నోటీసులపై తెలంగాణ మంత్రుల రియాక్షన్ చూడండి...

ABN, First Publish Date - 2023-03-08T12:06:08+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హనుమకొండ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liqugr Scam) లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavaitha)కు ఈడీ అధికారులు (ED Officers) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తెలంగాణ మంత్రులు (Telangana Ministers) తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. కవితకు నోటీసులపై మంత్రులు సత్యవతి రాథోడ్ (Satyavati Rathod), ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మీడియాతో మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం రోజే (Internation Womens Day) కవిత (BRS MLC) కు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణిని తెలియజేస్తోందన్నారు. కేంద్రం (Central Government) విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై మరింతగా పోరాడుతామని మంత్రులు స్పష్టం చేశారు.

కేంద్రం వేధింపులకు భయపడేది లేదన్నారు. ఇట్లాంటి చర్యలు బీజేపీ (BJP) పతనానికి నాందిగా పేర్కొన్నారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమైతే బీజేపీకి వెన్నులో వణుకుపుట్టిందని... అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ బోడిలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేషాలు వేసినా భయపడమని మంత్రులు ఎర్రబెల్లి, రాథోడ్ తేల్చిచెప్పారు.

విచారణకు సమయం కోరుతున్న కవిత...

కాగా... దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఉదయం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నారు. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పదేపదే ఈడీ ప్రస్తావించింది.

అయితే ఈడీ నోటీసులపై కవిత స్పందిస్తూ... ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరుకాలేనని.. విచారణకు సమయం కావాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల కోసం 10 న ఢిల్లీ (Delhi)లో ధర్నాకు కవిత సన్నాహాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమం తరువాత విచారణకు హాజరు అవుతానని ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకోనున్నట్లు కవిత పేర్కొన్నారు.

********************************************************************

ఇదికూడా చదవండి

Jagadish Reddy: ‘కవితకు నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట’


Updated Date - 2023-03-08T12:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising