Bandi Sanjay: దొంగ సార దందాలో కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు
ABN, First Publish Date - 2023-02-18T17:59:45+05:30
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేరు 4 సార్లు చార్జ్‌షీట్ (charge sheet)లో వచ్చిందని, దొంగ సార దందాలో కేసీఆర్ (KCR) ఎందుకు నోరు విప్పడం లేదని సంజయ్ ప్రశ్నించారు. దొంగ సారతో కేసీఆర్ కూతురు రూ.100 కోట్లు తీసుకుపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్.. నిన్ను శివుడు చూస్తాడు, మోదీ చూస్తారని బండి సంజయ్ హెచ్చరించారు. రజాకార్ల పాలనను తరిమికొడతామని, రాజకీయాలకు హిందూధర్మాన్ని ఉపయోగించను అని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందూధర్మాన్ని కించపర్చడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని బండి సంజయ్ విమర్శించారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఒకరిద్దరితో మొదలైన అరెస్ట్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta Srinivasula Reddy) తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతిచ్చింది. అయితే రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN-Andhra Jyothi) కి ఎక్స్‌క్లూజివ్‌గా చిక్కింది. ఈ రిపోర్టు బయటికి రావడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసులో మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు మరోసారి రిపోర్టులో బయటికి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కవిత ప్రతినిధిగా అరుణ్‌పిళ్లై ఉన్నారని ఈడీ పేర్కొంది. మరోసారి కవిత పేరు రావడంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.
మరోవైపు.. ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రాఘవ లిక్కర్ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఢిల్లీ లిక్కర్ కార్యకలాపాలన్నీ రాఘవ నిర్వహించేవారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా మాగుంట రాఘవ కలిశారని చెబుతున్నారు. రూ.100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్‌గ్రూప్‌లో రాఘవ కీలకంగా ఉన్నారని రిమాండ్ రిపోర్టు (Remand Report)లో ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, పెర్నార్డ్ రికార్డ్‌కు చెందిన బినయ్ బాబు పలుమార్లు ఆప్ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్, రిటైల్ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్(సిండికేట్)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ్, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూప్ తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా.. మాగుంట రాఘవను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో రేపొద్దున ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కొడాలి నాని, వల్లభనేని వంశీపై పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు.. భారతిని రోడ్డు మీదకు తెచ్చింది..
*************************************************
Updated Date - 2023-02-18T18:00:05+05:30 IST