IPS Officers : ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ
ABN, Publish Date - Aug 16 , 2024 | 08:11 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేసిన కూటమి సర్కార్.. తాజాగా మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. జులై-13న ఒకేసారి 37 మందిని ఐపీఎస్‌లను వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెల వ్యధిలోనే ఇప్పుడు మరో 10 మంది అధికారులను బదిలీ చేసింది కూటమి సర్కార్. ఈ మేరకు శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. పాలనలో ప్రక్షాళన తీసుకురావడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, ప్రమోషన్లు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
బదిలీలు ఇలా..
ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీలు
గ్రేహౌండ్స్ కమాండర్‌గా సుమిత్ సునీల్
అనంతపురం ఎస్పీగా జగదీశ్
సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కి అటాచ్
16వ బెటాలియన్ కమాండెంట్‌గా మురళికృష్ణ
గుంతకల్లు రైల్వే ఎస్‌ఆర్‌పీగా రాహుల్ మీనా
విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజ్
ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్ షరాన్
పార్వతీపురం SDPOగా అంకిత మహవీర్‌ను చంద్రబాబు సర్కార్ బదిలీ చేయడం జరిగింది.
Updated Date - Aug 16 , 2024 | 08:28 PM